Header Banner

ఆ వార్తలను నమ్మవద్దు! ప్రయాణికులకు రైల్వే శాఖ క్లారిటీ!

  Sat Apr 12, 2025 14:06        Others

తత్కాల్, ప్రీమియం తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో మార్పులు జరిగినట్లు సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై రైల్వే మంత్రిత్వ శాఖ స్పందించింది. టికెట్ బుకింగ్ విధానంలో ఎలాంటి మార్పులు చేయలేదని స్పష్టం చేసింది. తత్కాల్ టికెట్ల బుకింగ్ ప్రక్రియలో మార్పులు జరిగాయని, కొత్త సమయాలు అమల్లోకి వస్తాయని కొన్ని కథనాలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఉదయం 10:30కు ప్రీమియం తత్కాల్, 11 గంటలకు ఏసీ తత్కాల్, 12 గంటలకు నాన్-ఏసీ టికెట్లు బుక్ చేయొచ్చని కొన్ని కథనాల్లో పేర్కొన్నారు. ఈ రకమైన ప్రచారాన్ని రైల్వే శాఖ ఖండించింది.

 

ప్రస్తుతం తత్కాల్ టికెట్ బుకింగ్ విధానం యథాతథంగా కొనసాగుతోందని, ఏవైనా మార్పులపై అధికారికంగా ప్రకటించినపుడే ప్రజలు నమ్మాలని అధికారులు సూచించారు. ప్రయాణానికి ముందు రోజు ఉదయం 10 గంటలకు ఏసీ తత్కాల్ టికెట్లు, ఉదయం 11 గంటలకు నాన్-ఏసీ టికెట్ల బుకింగ్ ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. ప్రయాణికులు అధికారిక IRCTC వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా మాత్రమే టికెట్లు బుక్ చేయాలని, తప్పుడు ప్రచారాన్ని పట్టించుకోవద్దని మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది.

 

ఇది కూడా చదవండి: క్రికెట్ నిబంధనల్లో అనూహ్య మార్పులు.. ఐసీసీ కీలక నిర్ణయం! ఈ మార్పులపై చర్చించే అవకాశం..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మాజీ ఎమ్మెల్యేకు ఊహించని షాక్.. వైసీపీ సీనియర్ నేతపై కేసు నమోదు! కారుపై దాడి..

 

పోర్ట్‌కు వేగవంతమైన రహదారి.. ఆరు లైన్ల హైవే నిర్మాణం త్వరలో! ఎన్హెచ్ఎఐ మెగా ప్లాన్!

 

నేడు (12/4) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా ఫూలే జయంతి వేడుకలు! మంత్రులునేతలు ఘన నివాళులు!

 

వైసీపీకి నిడదవోలులో చుక్కెదురు! అవిశ్వాస నాటకం నిరాకరించిన కలెక్టర్.. మిగిలింది 14 ఓట్లు మాత్రమే!

 

మాజీ మంత్రి హైకోర్టులో షాక్.. ఇక అరెస్టేనా?

 

జగన్ చేసిన వ్యాఖ్యలు కలకలం - క్షమాపణ చెప్పాలని డిమాండ్! పోలీసు సంఘం స్ట్రాంగ్ కౌంటర్!

 

రెండు తెలుగు రాష్ట్రాల‌కు పండగ లాంటి వార్త! గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకు గ్రీన్ సిగ్న‌ల్‌!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Andhrapradesh #Tatkaltickets #IndianRailways #IRCTCUpdates #FakeNewsAlert #RailwayClarification #TravelSafe #TaktkalBooking #NoChanges #OfficialUpdate